: విజయవాడలో అమెరికా కాన్సులేట్ ఏర్పాటు చేయడం లేదట!
ఏపీలో అమెరికా కాన్సులేట్ ఏర్పాటు చేసేందుకు అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వార్తలు రావడం తెలిసిందే. దీనిపై, అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రకటన విడుదల చేసింది. తాము కొత్తగా కాన్సులేట్ కార్యాలయాలు ప్రారంభించడం లేదని తెలిపింది. విజయవాడలో తాము కాన్సులేట్ ఏర్పాటు చేయబోవడం లేదని ప్రకటనలో స్పష్టం చేసింది. అంతకుముందు, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధులు ఇటీవలే హైదరాబాదు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారని, ఈ సందర్భంగా, విజయవాడలో అమెరికా కాన్సులేట్ ఏర్పాటు చేయాలని బాబు వారిని కోరారని సీఎంవో వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.