: సాధ్విని పదవి నుంచి తప్పించాలన్న మా డిమాండ్ లో మార్పు ఉండదు: కాంగ్రెస్


కేంద్ర మంత్రి సాధ్వి నిరంజ్ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్యసభ అట్టుడుకుతోంది. జ్యోతిని ఎట్టి పరిస్థితుల్లోను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందేనని... తమ డిమాండ్ లో మార్పు ఉండదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సభ్యులు పలుసార్లు రాజ్యసభ కార్యకలాపాలకు అడ్డుతగిలారు. సాక్షాత్తు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ ఎంపీలు శాంతించలేదు. దీంతో, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఇప్పటికే సభను రెండు సార్లు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News