: అసెంబ్లీలో మంత్రి సీటులో సీఎం పన్నీర్ సెల్వం... సీటు బాగాలేదని వెళ్లిపోయిన కరుణ
తమిళనాడు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఏఐఏడీఎంకే అధినేత్రికి వీరవిధేయుడిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గతంలో మాదిరే సీఎంకు కేటాయించిన సీటులో కాకుండా మంత్రులకు కేటాయించిన సీటులో కూర్చుని... 'అమ్మ'పై తనకున్న భక్తిని చాటుకున్నారు. మరోవైపు, శాసనసభ సభ్యత్వం కోల్పోయిన జయ అసెంబ్లీకి రాకపోవడంతో... డీఎంకే చీఫ్ కరుణానిధి సభకు హాజరయ్యారు. అయితే, సభలో తనకు కేటాయించిన సీటుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సభను వీడి వెళ్లిపోయారు.