: మా వాళ్లపై ఒత్తిడిలేదు: ఆస్ట్రేలియా కోచ్ లేమన్


ఫిలిప్ హ్యూస్ మరణం తాలూకు ఒత్తిడి ఆసీస్ ఆటగాళ్లపై ఉండబోదని కోచ్ డారెన్ లేమన్ అంటున్నాడు. బుధవారం నాడు హ్యూస్ అంత్యక్రియలకు హాజరైన ఆటగాళ్లు మరింత వ్యాకులతకు లోనయ్యే అవకాశాలున్నాయంటూ మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. లేమన్ స్పందిస్తూ, భారత్ తో తొలి టెస్టును ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడడం ద్వారా ఆసీస్ ఆటగాళ్లు హ్యూస్ కు నివాళి అర్పించాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు. "తీవ్రంగా కలత చెందిన ఆటగాళ్లలో ఉత్తేజం కలిగించేందుకు శ్రమిస్తాం" అని పేర్కొన్నాడు. మాక్స్ విల్లేలో జరిగిన హ్యూస్ అంత్యక్రియలకు ఆసీస్ జట్టు మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా, కెప్టెన్ మైకేల్ క్లార్క్ సహా చాలామంది ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాన పేసర్ ర్యాన్ హారిస్ తాను తొలి టెస్టు ఆడేది కష్టమేనని ప్రకటించడం ఆసీస్ ఆటగాళ్ల మానసిక స్థితికి అద్దం పడుతోంది.

  • Loading...

More Telugu News