: నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి హీరో నితిన్
హీరో నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న పాప్యులర్ క్విజ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' రెండవ సీజన్ ఈనెల 8 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే చాలా భాగాలను షూట్ చేశారు. ఈసారి షోకు హీరో నితిన్ కూడా అతిథిగా హాజరవుతున్నాడు. తాజాగా తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈ విషయాన్ని తనే ట్విట్టర్ లో తెలిపాడు. "ఇప్పుడే నేను పాల్గొన్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో నాగార్జునగారితో చిత్రీకరణ పూర్తయింది... చాలా సరదాగా ఉంది!!" అని నితిన్ చెప్పాడు. నాలుగు నెలల కిందట తొలి సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది.