: 68 దేశాల జైళ్లలో మగ్గుతున్న 6,500 మంది భారతీయులు
మొత్తం 6,483 మంది భారతీయులు వివిధ నేరారోపణలపై 68 దేశాల జైళ్లలో ఉన్నారని, సౌదీ అరేబియాలో అత్యధికంగా 1,469 మంది జైళ్లలో మగ్గుతున్నారని కేంద్ర ప్రభుత్వం లోక్ సభకు వివరించింది. పాకిస్తాన్ లో 421 మంది భారతీయులు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ వద్ద ఉన్న అనధికార సమాచారం ప్రకారం 74 మంది యుద్ధఖైదీలు పాక్ జైళ్లలో ఉన్నారని తెలిపారు. మొత్తం 322 మంది తమ జైలు శిక్షను పూర్తి చేసుకున్నా, వివిధ కారణాల రీత్యా విడుదల కాలేదని తెలిపారు. 2013 లో 6,683 మంది భారతీయులు విదేశాల్లో మరణించారని సుష్మ లోక్ సభకు వివరించారు.