: పూలమ్మిన పిల్లాడికి రూ.79.18 లక్షల వేతనం
ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన అనంతరం వేసవి సెలవుల్లో సూర్యాపేట పట్టణంలోని పూలసెంటర్, పాతబస్టాండ్ ప్రాంతాల్లో పూలమ్మి అమ్మానాన్నలకు ఆసరాగా నిలిచిన నజీర్ బాబా ఇప్పుడు సాలీనా రూ.79.18 లక్షల రూపాయల ఉద్యోగంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాన్పూర్ ఐఐటీలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో అమెరికాకు చెందిన ఒరాకిల్ కు అప్లికేషన్ ఇంజినీర్‌గా ఎంపికయ్యాడు. నజీర్ తండ్రి జమాలుద్దీన్ ఓ గ్రానైట్ కంపెనీలో కూలిపని చేస్తుండగా, తల్లి రహిమున్నిసా టైలరింగ్ చేసేది. తాను ఈ స్థానానికి చేరుకోవడానికి తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే కారణమంటున్నాడు నజీర్. అల్ ది బెస్ట్!