: శ్రీలంక జైల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన భారత మత్స్యకారులు
శ్రీలంకలోని జాఫ్నా జైలులో మగ్గుతున్న భారత మత్స్యకారులు ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. తమను త్వరగా విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 38 మంది వరకు ఆమరణ దీక్ష చేస్తున్నట్టు జైలు వర్గాల అధికారులు తెలిపారు. దీనిపై జాఫ్నాలోని భారత కాన్సులేట్ కార్యాలయం కొలంబోలోని భారత హైకమిషన్ వర్గాలను అప్రమత్తం చేసింది. గత నెలలో శ్రీలంక ఐదుగురు భారత మత్స్యకారులను విడుదల చేసింది. మాదకద్రవ్యాల రవాణా ఆరోపణల నేపథ్యంలో, వారికి మరణశిక్ష విధించినా, దేశాధ్యక్షుడు మహింద రాజపక్స క్షమాభిక్ష ప్రసాదించారు.