: నాకు పద్మశ్రీ ఇవ్వకపోవడం బాధగా ఉంది: కైకాల సత్యనారాయణ
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ తనకు పద్మశ్రీ పురస్కారం రాకపోవడం పట్ల మథనపడుతున్నారు. పాతికేళ్ల క్రితమే తనను పద్మశ్రీకి నామినేట్ చేశారని... కానీ, ఇంతవరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో టీడీపీ ఎంపీగా ఉన్నందున పద్మశ్రీ ఇవ్వలేదని... ఆ తర్వాతైనా ఇచ్చి ఉండచ్చని, కానీ అలా జరగలేదని చెప్పారు. ప్రముఖ నటుడు కాంతారావు పేరిట జరిగిన సన్మానసభలో సత్యనారాయణను సన్మానించి, వెండి కిరీటం అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారు.