: మోదీ పాలనకు ముగ్ధుడనయ్యా: ఒబామా
భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలన తననెంతో ఆకర్షించిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పొగిడారు. ముఖ్యంగా ఇండియాలోని పరిపాలనాధికారుల్లో జడత్వాన్ని పోగొట్టేందుకు ఆయన చేస్తున్న కృషికి తాను ముగ్ధుడనయ్యానని అన్నారు. మోదీని 'చేతల మనిషి'గా అభివర్ణించిన నెల రోజుల్లోపే మరోసారి ఒబామా పొగడ్తలతో ముంచెత్తడం విశేషం. మోదీ పాలనాపరంగా తనదైన ముద్ర వేయడంలో ఎంతవరకూ విజయం సాధిస్తారో వేచి చూడాల్సి ఉందని ఆయన అన్నారు.