: చెత్తబుట్టలో అమరవీరుల దుస్తులు


మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో అసువులు బాసిన సీఆర్పీఎఫ్ జవాన్ల యూనిఫామ్స్, బూట్లు చెత్తకుప్పలో కనపడటం వివాదానికి దారి తీసింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి అమరులైన వీర జవాన్లకు ఇంత అవమానమా? అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రక్తంతో తడిసిన జవాన్ల బట్టలు, బూట్లు తదితరాలను డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ మెమోరియల్ ఆసుపత్రిలోని చెత్తబుట్టలో పడేశారు. విషయం తెలుసుకున్న సుకుమా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వికాస్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిని సందర్శించి చెత్తబుట్టలో పడేసిన జవాన్ల దుస్తులను కాంగ్రెస్ భవన్ కు తరలించగా, తర్వాత సీఆర్పీఎఫ్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News