: స్కూలు బస్సును ఢీకొన్న రైలు... ఐదుగురు చిన్నారుల మృతి


ఉత్తరప్రదేశ్ లోని మావ్ జిల్లాలో దారుణం సంభవించింది. రైల్వే క్రాసింగ్ వద్ద ఓ స్కూల్ బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News