: పొగాకు నిషేధంపై స్పీడు తగ్గించండి: కేంద్రంపై తెలుగు ఎంపీల ఒత్తిడి
ధూమపానంపై యుద్ధం ప్రకటించిన నరేంద్ర మోదీ సర్కారుకు ఎన్టీఏ మిత్రపక్షాలు బ్రేకులేస్తున్నాయి. ఈ విషయంలో ప్రత్యేకించి ఏపీకి చెందిన ఎంపీల నుంచి కేంద్రానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. పొగాకు నిషేధంపై స్సీడు తగ్గించాలని ఏపీ, కర్ణాటకకు చెందిన ఎంపీలు మోదీ సర్కారుపై ఒత్తిడి చేస్తున్నారు. పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు స్పీడు తగ్గించాలని ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, బీజేపీ ఎంపీ హరిబాబు, వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పతో కలిసి బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపీ నద్దాను కలిశారు.