: పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై చైనా కీలక వ్యాఖ్యలు
జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతం ఆ దేశానిదేనని చైనా అంటోంది. చైనా నుంచి పీఓకే మీదుగా వందల కోట్ల రూపాయల వ్యయంతో పాకిస్తాన్ కు రహదారి నిర్మించేందుకు ఆ దేశం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో రహదారి నిర్మాణంపై భారత్ అభ్యంతరాలను తాము పట్టించుకోబోమని కూడా చైనా స్పష్టం చేసింది. గిల్గిత్-బాల్టిస్తాన్ రీజియన్ పాకిస్తాన్ దేశానిదని అక్కడ రహదారికి భారతదేశ అనుమతి అవసరం లేదని తెలిపింది. పాక్, భారత్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై మాత్రం తాము కల్పించుకోబోమని వివరించింది. చైనా తాజా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధంపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.