: రేణుదేశాయ్ వీడియో కోసం ఎదురు చూస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులు
తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత విషయాలను నేడు వెల్లడిస్తానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ ప్రకటించినప్పటి నుంచి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్నానని, దాన్ని యూట్యూబ్ లో చూడవచ్చని నిన్న ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలు పవన్ తో ఎందుకు విభేదాలు వచ్చాయన్న విషయంపై ఆమె వివరణ ఇవ్వచ్చని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆ వీడియో కోసం పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి సగటు సినీ ప్రేక్షకులు, రాజకీయ నేతలు సైతం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.