: రెండు, మూడేళ్లలో చైనాను ఇండియా అధిగమిస్తుంది: ముఖేష్ అంబానీ


రానున్న రెండు, మూడేళ్లలో వృద్ధి రేటులో చైనాను మన దేశం అధిగమిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. దేశంలో అంతర్గతంగా నెలకొన్న స్థిరత్వం మన దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతుందని అన్నారు. 2014 సంవత్సరాన్ని మన దేశ చరిత్రలో అత్యంత అదృష్టకరమైన ఏడాదిగా ఆయన అభివర్ణించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉందన్న విషయంలో తనకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. చమురు ధరలు దిగివస్తుండటం కూడా భారత్ వృద్ధికి ఎంతో దోహదం చేస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News