: కేసీఆర్ పాలనను అంతం చేద్దాం: మావోయిస్టు పోస్టర్ల కలకలం
తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతమొందించాలని పిలుపునిస్తూ వెలసిన మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ శివారులోని లింగోజిగూడెం, వలిగొండ క్రాస్ వద్ద వెలసిన ఈ పోస్టర్లలో పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీజీఎల్ఏ) వారోత్సవాలను జయప్రదం చేయడంతో పాటు కేసీఆర్ పాలనను అంతమొదించేందుకు నడుం బిగించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని మావోల పోస్టర్లు వెలువడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలో అసలు మావోయిస్టులే లేరంటూ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించిన మరునాడే ఈ పోస్టర్లు వెలుగుచూడటం గమనార్హం.