: సుప్రీంలో కొత్తగా సోషల్ జస్టిస్ బెంచ్!
సుప్రీంకోర్టు చరిత్రలో సరికొత్తగా ఓ బెంచ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మహిళలు, పిల్లలు, సమాజంలో అణచివేతకు గురైన వర్గాల వారి వాదనలపై త్వరితగతిన స్పందించేందుకు ఉద్దేశించిన ‘సోషల్ జస్టిస్ బెంచ్’ త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. ఈ నెల 12న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ యూయూ లలిత్ ఈ బెంచ్ పై నుంచి పలు వివాదాలపై తీర్పు ఇవ్వనున్నారు. ఇకపై ప్రతి శుక్రవారం ఈ బెంచ్ పనిచేయనుంది. సామాజికాంశాలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను వినడంతో పాటు సత్వర నిర్ణయాలు వెలువరించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ఈ బెంచ్ కు రూపకల్పన చేశారు.