: విశాఖ ఏజెన్సీని వణికిస్తున్న చలి పులి... లంబసింగిలో 3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత


విశాఖ మన్యం ప్రాంతం చలితో వణికిపోతోంది. గత కొద్దిరోజులుగా విశాఖ ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చలి తీవ్రత పెరిగింది. తాజాగా బుధవారం రాత్రి మన్యంలో రికార్డు స్థాయి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిపులికి నిలయమైన లంబసింగితో పాటు మోదకొండమ్మ పాదాల ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 3 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో 5 డిగ్రీలు, చింతపల్లిలో 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News