: మెరిసిన మరో తెలుగుతేజం... రూ. 80.60 లక్షల జీతం


ప్రతిష్ఠాత్మక సంస్థల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలను చేజిక్కించుకుంటూ తెలుగు విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. మూడు రోజుల క్రితం ముంబయి ఐఐటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీమేఘన గూగుల్ సంస్థలో రూ. 75 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సంపాదించిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడికి చెందిన సిద్ధార్థ్ మైక్రోసాఫ్ట్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాడు. అతనికి మైక్రోసాఫ్ట్ రూ. 80.60 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. అమెరికాలోని రెడ్ మౌంట్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం సిద్ధార్థ్ గౌహతి ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

  • Loading...

More Telugu News