: నేడు చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం భేటీ
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం నేడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ కానుంది. గతంలో సీఎంగా ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంకుతో అత్యంత సన్నిహితంగా మెలగిన చంద్రబాబు పలు ఆర్థిక సంస్కరణలకు తెరతీసిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత ఆయన మళ్లీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని నిర్మాణం, నిధుల లభ్యత, విదేశీ సంస్థల సహాయ సహకారం తదితర అంశాలు నేటి భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి.