: ఏపీలో రూ.50 వేల లోపు రుణాలు మాఫీ: నేడు చంద్రబాబు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం చంద్రబాబునాయుడు నేటి మధ్యాహ్నం విధాన ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. రూ.50 వేల లోపు రుణాలను ఒకే విడతలో మాఫీ చేయనున్న ప్రభుత్వం, రూ.50 వేలకు పైబడ్డ రుణాలకు సంబంధించి తొలుత 20 శాతం నిధులను విడుదల చేయనుంది. మిగిలిన మొత్తానికి నాలుగేళ్ల కాలపరిమితితో కూడిన బాండ్లను జారీ చేసేందుకు నిర్ణయించామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూముల సమీకరణపై నేడు చంద్రబాబు తుళ్లూరు పరిసర ప్రాంత రైతులతో రెండోమారు ముఖాముఖి భేటీ నిర్వహించనున్నారు.