: అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా: శ్రీకాంత్ అడ్డాల


తనకు లభించిన అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన ముకుంద ఆడియో వేడుక సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండో సినిమాగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చేస్తున్నప్పుడు వచ్చిన ఓ ఆలోచనకు ఓ మిత్రుడు చేసిన సూచన ప్రకారం నాగబాబుగారి ఇంటికెళ్లి మీ అబ్బాయిని నాకివ్వండి సినిమా తీస్తానని అడిగానని, ఆయన మరో మాట చెప్పకుండా వరుణ్ ను తనకు అప్పగించారని చెప్పారు. అవకాశాలే అరుదైన సందర్భంలో మూడో ప్రయత్నంగా మంచి సినిమా తీశానని ఆయన తెలిపారు. అలాగే తనతో పని చేసిన టెక్నీషియన్లు, నటులను వేదికకు పరిచయం చేశారు.

  • Loading...

More Telugu News