: రెండు రాష్ట్రాల్లో జెండా ఎగురవేయనున్న గవర్నర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని, జనవరి 26న రెండు రాష్ట్రాల్లో జెండా ఎగురవేయాలని నిర్ణయించారు. రెండు గంటల వ్యవధిలో ఏపీ, తెలంగాణలో గవర్నర్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోని నేపథ్యంలో గవర్నర్ రెండు రాష్ట్రాలను ఉద్దేశించి ఎలా ప్రసంగిస్తారోనని సర్వత్ర ఆసక్తి నెలకొంది.