: అవనిగడ్డలో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్
కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన విద్యార్థులది అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామం. కాగా, కిడ్నాప్ కు గురైన సుమంత్, మల్లికార్జున్ ఆరోతరగతి చదువుతున్నారు. కిడ్నాప్ చేసిన అనంతరం కిడ్నాపర్లు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.