: అమర గాయకుడు ఘంటసాల జీవిత విశేషాలతో టెలీఫిల్మ్
అమర గాయకుడు ఘంటసాల జీవిత చరిత్ర టెలీఫిల్మ్ గా రాబోతోంది. ఘంటసాల దివంగతుడై 40 ఏళ్లు అవుతున్నప్పటికీ ఆయన పాటలు చిరంజీవులుగా నిలిచిపోయాయి. ప్రతి తరానికీ ఆయన గీతాలే సంగీత పాఠ్యాంశాలంటే అతిశయోక్తి కాదేమో! ఘంటసాల జీవితం ఆధారంగా చాలా పుస్తకాలు వెలువడ్డాయి. వెలువడిన ప్రతి ప్రచురణ అపూర్వ ఆదరణ పొందింది. అందులో 'ఘంటసాల పాఠశాల' అనే పుస్తకం 828 పేజీలతో 555 పాటలు కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆ పుస్తకం ఓ టెలీఫిల్మ్ గా రాబోతోంది. ఘంటసాల వీరాభిమాని సీహెచ్ రామారావు ఏడాదిపాటు శ్రమించి, పరిశోధించి 'ఘంటసాల' స్క్రిప్ట్ రాశారు. దాని ఆధారంగా సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కేవీవీ సత్యనారాయణ సమర్పణలో కర్రి బాలజీ దర్శకత్వంలో 'ఘంటసాల' టెలీఫిల్మ్ రూపుదిద్దుకోనుంది. ఈ అద్భుతమైన దృశ్యకావ్యానికి మహిత్ అనే వర్థమాన సంగీత దర్శకుడు మ్యూజిక్ అందించడం విశేషం.