: ఏపీలో మార్చి 26 నుంచి పదవ తరగతి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. మార్చి 26 నుంచి ఏప్రిల్ 9 వరకు పరీక్షలు జరగనున్నాయని విద్యాశాఖ ప్రకటించింది. 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పింది. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు పదవ తరగతి వృత్తి విద్యా పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్ష షెడ్యూల్... * మార్చి 26న -తెలుగు పేపర్ 1, మార్చి 27న- తెలుగు పేపర్ 2 * 30న హిందీ * 31న -ఆంగ్ల పేపర్ 1, ఏప్రిల్ 1న- ఆంగ్ల పేపర్ 2 * ఏప్రిల్ 2- గణితం పేపర్ 1, ఏప్రిల్ 4 -గణితం పేపర్ 2 * ఏప్రిల్ 6 -సామాన్య శాస్త్రం పేపర్ 1, ఏప్రిల్ 7- సామాన్య శాస్త్రం పేపర్ 2 * ఏప్రిల్ 8 -సాంఘిక శాస్త్రం పేపర్ 1, ఏప్రిల్ 9- సాంఘిక శాస్త్రం పేపర్ 2