: ముఖ్యమంత్రి మీతో మాట్లాడతారట: రైతులకు అధికారుల ఫోన్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం పరిధిలోని గ్రామాల రైతులలో భూములు ఇచ్చేందుకు ససేమీరా అంటున్న వారితో ముఖ్యమంత్రి స్వయంగా సమావేశం కానున్నారు. ఈ మేరకు వెంకటపాలెం, నిడమర్రు, నందడం, ఉద్ధండరాయునిపాలెం తదితర గ్రామాల్లోని 20 మంది రైతులకు సీఎం ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లాయని సమాచారం. వారిని హైదరాబాద్ రావాలని ఆహ్వానించిన సీఎంవో అధికారులు "చంద్రబాబు నాయుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారు" అని చెప్పారట. మంగళవారం రాత్రి సుమారు 20 మంది రైతులకు ఈ తరహా ఫోన్లు చేసినట్లు సమాచారం. వీరితో గురువారం చర్చలు జరిపి వారిని ఒప్పించాలని బాబు భావిస్తున్నారు.