: పాతబస్తీలో కాల్పులు... రూ.3.5 లక్షలు దోపిడీ
హైదరాబాదు పాతబస్తీలోని సంతోష్ నగర్ రక్షపురంలో కాల్పుల కలకలం రేగింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న బాలరాజు, రాజేష్ అనే తండ్రీకొడుకులను కొంత మంది వ్యక్తులు అటకాయించి, దాడి చేశారు. వాళ్లు తేరుకునేలోపు తుపాకీతో గాలిలో కాల్పులు జరిపారు. దీంతో బెదిరిపోయిన తండ్రీకొడుకుల నుంచి 3.5 లక్షల రూపాయల నగదు గుంజుకుని పారిపోయారు. ఘటనలో స్వల్పంగా గాయపడిన తండ్రీకొడుకులను స్థానికులు దగ్గర్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.