: భారత్ లో అమెరికా రాయబారిగా రాహుల్ వర్మ!
భారత్ లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ నియామకం ఖరారైనట్టు తెలిసింది. మంగళవారం నాడు సమావేశమైన అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వర్మను కమిటీకి పరిచయం చేసిన అనంతరం సెనేటర్ హ్యారీ రైడ్ మాట్లాడుతూ, భారత్ తో బలమైన సంబంధాలు కొనసాగించేందుకు ఆయనే సరైన వ్యక్తని వివరించారు. విదేశీ వ్యవహారాలపై ఆయనకున్న పట్టు, హిల్లరీ క్లింటన్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన అనుభవం అమెరికాకు సహాయపడగలవని అన్నారు.