: 'వరల్డ్ కప్' కు ఎంపికైన భారత అంపైర్
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వన్డే వరల్డ్ కప్ కు ఐసీసీ మ్యాచ్ రిఫరీలు, అంపైర్లను ప్రకటించింది. వరల్డ్ కప్ లో బాధ్యతలు నిర్వహించే ఇంటర్నేషనల్ కేటగిరీ అంపైర్ల జాబితాలో భారత్ కు చెందిన ఎస్.రవి చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో జోహాన్ క్లోటే, సైమన్ ఫ్రై, క్రిస్ గఫానీ, మైకేల్ గాఫ్, రాన్ మోర్ మార్టినెజ్, రుచిరా పల్లియగురు, జోయెల్ విల్సన్ ఉన్నారు. ఐసీసీ కీలక మ్యాచ్ లలో బాధ్యతలు నిర్వహించేందుకు ఎలైట్ అంపైర్లను కూడా ప్రకటించడం తెలిసిందే.