: పబ్ లో కొట్టుకున్న అలియా, సాక్షి


ముంబై లోని ఫీనిక్స్ మాల్ లోని ట్రిస్ట్ పబ్ లో పూజాబేడీ కుమార్తె అలియా, ఫిల్మ్ డైరెక్టర్ రామానంద సాగర్ ముని మనవరాలు సాక్షీ సాగర్ లు కొట్టుకున్నారు. అంతేగాకుండా, పోలీసులకు పరస్పరం ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ముంబై మిర్రర్ పత్రిక కథనం ప్రకారం, పబ్ లో ఇరువురూ తమ తమ స్నేహితులతో కలసి పార్టీ చేసుకుంటున్నారు. అలియా, ఆమె తల్లి పూజా తప్పతాగి తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని సాక్షి తల్లి మీనాక్షి ఆరోపించగా... మీనాక్షి, సాక్షే తాగి, తమ పార్టీని చెడగొట్టి గొడవ పెట్టుకున్నారని పూజాబేడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు ఫిర్యాదులను తీసుకున్న ముంబై పోలీసులు విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News