: ఆలస్యమైతే ప్రవేశం నిషిద్ధం: బీజేపీ ఎంపీలకు నరేంద్ర మోదీ షాక్
బహిరంగ ప్రసంగాల్లోనే కాక మాటతీరులోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ, తాజాగా సమయపాలన కూడా పాటించాల్సిందేనని పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆలస్యంగా వచ్చిన వారిని సమావేశ మందిరంలోకి అనుమతించవద్దని ఆయన తన సిబ్బందికి సూచించారు. తొలుత ఈ నిబంధన పార్టీ పార్టమెంటరీ భేటీల్లో అమలులోకి వచ్చేసింది. దీంతో మంగళవారం నాడు ఏకంగా 20 మంది ఎంపీలు ఈ భేటీ జరిగిన బాలయోగి ఆడిటోరియం ముందు బయటే తచ్చాడుతూ తిరగాల్సి వచ్చింది. ఇకపై ప్రతి మంగళవారం ఉదయం 9.35 నిమిషాలకు ఒక్క క్షణం ఆలస్యమైనా పార్టీ ఎంపీలకు పార్లమెంట్ సముదాయంలోని బాలయోగి ఆడిటోరియం లోపలికి అనుమతి లభించదు. దశలవారీగా మిగతా సమావేశాల్లోనూ ఈ నిబంధన అమలులోకి రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.