: మోనాలిసా చైనా నుంచి వచ్చిన బానిస... డావిన్సీ తల్లి కూడా: చరిత్రకారుడు యాంజిలో


ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన తన తల్లి చిత్రమే 'మోనాలిసా' అని, ఆమె చైనా నుంచి వచ్చిన బానిస అని ఇటలీ కి చెందిన చరిత్రకారుడు యాంజిలో పరాటికో భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె వెనుక చైనాకు చెందిన ప్రకృతి దృశ్యం ఉందని, ఆమె ముఖంలో చైనీయుల పోలికలున్నాయని వివరించారు. లియోనార్డో తండ్రి క్లయింట్లలో ఒకరి దగ్గర క్యాతరినా అనే మహిళా బానిస ఉండేదని, 1452లో లియోనార్డో పుట్టిన తరువాత ఆమె కనిపించలేదని యాంజిలో తెలిపారు. కాగా, ఈ ఇంటర్వ్యూ ప్రచురితమయ్యాక 40 లక్షల మంది చదవగా, 1.6 లక్షలకు పైగా పోస్టింగ్స్ వచ్చాయి.

  • Loading...

More Telugu News