: హ్యూస్ కు నివాళిగా ప్రత్యేక ఫొటో పోస్టు చేసిన సచిన్
భారత బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ (41) ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కు నివాళులర్పించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. "ఫిల్ నిన్ను మిస్సవుతున్నాం. ఆటలో పర్ఫెక్షన్ కోసం నీ ఆరాటం, నేర్చుకోవడం పట్ల నీ తపన ఎంతగానో ఆకట్టుకున్నాయి" అని పేర్కొన్నాడు. అంతేగాకుండా, హ్యూస్ తనతో కలిసి తీయించుకున్న ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశాడు. అటు, లెగ్ స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే కూడా నివాళి తెలిపాడు. "ఫిల్ హ్యూస్ ఆత్మకు శాంతి కలుగుగాక" అంటూ పేర్కొన్నాడు.