: బాధ్యతలు చేపట్టిన సీబీఐ కొత్త డైరెక్టర్
సీబీఐ నూతన డైరెక్టర్ గా అనిల్ కుమార్ సిన్హా నేటి ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సవాళ్ల పట్ల తాను అప్రమత్తంగా ఉంటానని ఈ సందర్భంగా అనిల్ కుమార్ వెల్లడించారు. అందరి సహకారంతో కేసుల విచారణలో ముందడుగు వేస్తానని అన్నారు. కాగా, ప్రధానమంత్రి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిన్న సమావేశమై సిన్హాను సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.