: చేస్తున్న ఉద్యోగాలు వదిలి ఎస్సై పోస్టుల బాటపడుతున్నారు!
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది! డిప్యూటీ జైలర్లు తమ ఉద్యోగాలను వదిలి, ఎస్సై పోస్టుల బాట పడుతున్నారట. డిప్యూటీ జైలర్ గా కరడుగట్టిన నేరగాళ్ల మధ్యలో గడపడం కంటే, ఎస్సై హోదాలో క్రిమినల్స్ తో డీల్ చేయడమే బెటర్ అని వారు భావిస్తున్నారు. జైళ్లలో క్రిమినల్స్ ను క్రమశిక్షణలో ఉంచే క్రమంలో, కొన్నిసార్లు దాడులకు గురికావాల్సి వస్తుండడం డిప్యూటీ జైలర్లను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, ఇటీవల కాలంలో ఉద్యోగాలను వీడుతున్న డిప్యూటీ జైలర్ల సంఖ్య పెరిగిపోతోంది. దీనిపై కడప రేంజి డీఐజీ జి.జయవర్ధన్ మాట్లాడుతూ, తమ పరిధిలో 25 మంది డిప్యూటీ జైలర్లలో 15 మంది ఉద్యోగాలు వదిలివెళ్లారని తెలిపారు. కాగా, డిప్యూటీ జైలర్ గా విధుల్లో చేరేముందు విధిగా బాండ్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ బాండ్ మొత్తం చెల్లించి మరీ ఉద్యోగానికి గుడ్ బై చెబుతున్నారట.