: చట్టసభ సభ్యులు సక్రమంగా మాట్లాడాలి: ఎల్.కె. అద్వానీ
కలకలం రేపుతున్న కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనేత, ఎంపీ ఎల్ కే అద్వానీ స్పందించారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు బహిరంగంగా మాట్లాడేటప్పుడు సక్రమంగా మాట్లాడాలని సూచించారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ, "ప్రతి పార్లమెంటు సభ్యుడు సరిగా మాట్లాడతారని అందరూ భావిస్తారు" అన్నారు. ఇదిలాఉంటే మరోవైపు సాధ్వి వ్యాఖ్యలపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగుతోంది. సదరు మంత్రి రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.