: సమంతా ఛాలెంజ్ పూర్తి చేసిన త్రిష
కథానాయిక సమంతా చేసిన ఛాలెంజ్ ను చెన్నై భామ త్రిష కృష్ణన్ సీరియస్ గా పూర్తి చేసింది. ఇంతకీ ఏంటా ఛాలెంజ్ అనుకుంటున్నారా! స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శామ్ కొన్ని వారాల కిందట త్రిషను నామినేట్ చేసింది. తాజాగా ఆమె దాన్ని స్వీకరించింది. ఈ ఉదయం చెన్నైలో తాంబరం సమీపంలోని ముదిచుర్ లో ఉన్న ఎన్విరాన్ మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (ఈఎఫ్ఐ)కు చెందిన యానిమల్ హోమ్ లో త్రిష చీపురు పట్టి శుభ్రం చేసింది. ఈ కార్యక్రమంలో తనతో పాటు పలువురు పాల్గొని సాయం చేశారు. దానికి సంబంధించిన ఫొటోలను అమ్మడు ట్విట్టర్ లో పోస్టు చేసింది.