: ఐదేళ్లు చెప్పింది వినాల్సిందే... విపక్షాలకు వెంకయ్య నాయుడు క్లాస్


ఐదేళ్ళపాటు మేము చెప్పింది వినాల్సిందేనని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు విపక్ష పార్టీల సభ్యులకు క్లాస్ పీకారు. మరో మంత్రి సాధ్వీ నిరంజన్ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని సర్దిచెబుతున్న సమయంలో విపక్ష సభ్యులు పెద్దగా నినాదాలు చేయడంతో వెంకయ్యకు కోపం వచ్చింది. ఐదేళ్లు తాము చెప్పింది వినాల్సిందేనని వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ్ వాదీ డిమాండ్ ను తాము సమర్థించేది లేదని, మంత్రి పార్లమెంట్ వెలుపల వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఆమె సభకు వచ్చి తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసి, క్షమాపణ కూడా చెప్పాక ఇంకా రాద్ధాంతం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News