: వరల్డ్ కప్ బెర్తుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఢిల్లీ స్టార్


ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్ ఇప్పుడప్పుడే ముగిసిపోదని సంకేతాలిస్తున్నాడు. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ కు టీమిండియా ప్రాబబుల్స్ లో స్థానం సంపాదిస్తానని ధీమాగా చెబుతున్నాడు. 30 మంది వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో తన పేరు కూడా ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పాడు. దేశం తరపున వరల్డ్ కప్ లో ఆడాలని ప్రతి క్రికెటర్ అనుకుంటాడని, తాను అలాంటివాడినేనని చెప్పుకొచ్చాడు. 2003, 2007, 2011 వరల్డ్ కప్ టోర్నీల్లో పాల్గొన్న సెహ్వాగ్ కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. దేశవాళీ పోటీల్లోనూ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. దీంతో, సెలెక్టర్లు జట్టు ఎంపిక సందర్భంగా కనీసం అతని ప్రస్తావన కూడా లేకుండా సమావేశాలు ముగిస్తున్నారు.

  • Loading...

More Telugu News