: మిత్రుడు దేవేన్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న అమితాబ్


బాలీవుడ్ అలనాటి కమెడియన్ దేవేన్ వర్మ మంగళవారం నాడు కన్నుమూశారు. ఆయన మృతికి బాలీవుడ్ సినీ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. దేవేన్ వర్మ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు సన్నిహితుడు. మిత్రుడి మరణం పట్ల బిగ్ బి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో తన బాధను పంచుకున్నారు. 'లక్షలాది మంది ముఖాలపై నవ్వులు పూయించిన ఫ్రెండ్, సహనటుడు, ప్రొడ్యూసర్ ఇక లేడు' అంటూ ట్వీట్ చేశారు. తామెప్పుడు కలుసుకున్నా 'దిస్ ఫ్లోర్ ఈజ్ మేడ్ ఆఫ్ సిమెంట్ కాంక్రీట్' అంటూ విభిన్న రీతిలో పలకరించుకునేవారమని అమితాబ్ తెలిపారు. "మనకే సొంతమైన ఆ పలకరింపును ఇక పునరావృతం చేయలేం మిత్రమా" అని సంతాపాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News