: కానిస్టేబుళ్ల కీచక పర్వం... రాజీ కుదిర్చిన ఎస్ఐ... ఉన్నతాధికారుల కన్నెర్ర


రాత్రి గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్, హోంగార్డు ఓ యువతిని బెదిరించి అత్యాచారం చేశారని వచ్చిన ఆరోపణలను గుంటూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. సంఘటనా స్థలం దగ్గరి ఓ కార్యాలయం వెలుపల ఉన్న సీసీ కెమెరాలో యువతిని బెదిరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వీటిని పరిశీలించిన ఉన్నతాధికారులు, బాధితురాలి ఫిర్యాదు తీసుకోవాలని, ఆమె ఇవ్వకుంటే సుమోటోగా కేసు నమోదు చేయాలని సూచించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరినీ సాయంత్రానికి అరెస్ట్ చేసే అవకాశముంది. ఈ వ్యవహారంలో కొత్తపేట ఎస్సై రాజీ కుదిర్చినట్టు తెలిసింది. ఆయనపై కూడా చర్య తీసుకునే అవకాశముందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఘటనపై అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌ కుమార్ విచారణ జరుపుతున్నారు. నిన్న రాత్రి తమకు తారసపడిన యువతీయువకులను బెదిరించి, యువకుడిని పంపేసి యువతిపై అత్యాచారం చేశారన్నది వీరిపై ప్రధాన అభియోగం.

  • Loading...

More Telugu News