: ప్రపంచ అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణ ప్రాజెక్టులో చేరిన భారత్


ప్రపంచంలో అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణ ప్రాజెక్టులో అమెరికా, చైనా, జపాన్ దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి, ఆ శాఖ సీనియర్ అధికారులు, చైనా, జపాన్, అమెరికా దేశాల రాయబార కార్యాలయ ప్రతినిధుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. హవాయిలోని మౌంట్ మౌనా కియా అనే ద్వీపంలో 4,050 మీటర్ల ఎత్తులో (హిమాలయాల్లో సగం పరిమాణం) ఈ 30 మీటర్ల టెలిస్కోప్ ను నిర్మిస్తున్నారట. ఒప్పందంలో భాగంగా నిర్మాణానికి భారత్ రూ.1300 కోట్ల సహాయం అందించనుంది. ఈ ప్రాజెక్టు ఒప్పందంలో ఐదవ దేశంగా త్వరలో కెనడా కూడా చేరనుందని తెలుస్తోంది. ఖగోళ భౌతిక శాస్త్ర రంగంలో కీలక పరిశోధనలకు ఈ టెలిస్కోప్ సహాయపడుతుందని, విశ్వంలోని వివిధ కోణాల అవగాహనకు ఇది ఉపయోగపడనుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News