: ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలో ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుల పెట్టుబడి!


వినూత్న ఆలోచనతో రంగప్రవేశం చేసిన ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్, విశ్వవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తుండగా, దాని వ్యవస్థాపకులు మాత్రం ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కాస్త విడ్డూరమనిపించినా, ఇది వాస్తవం. ఎందుకంటే సచిన్ బన్సల్, బిన్ని బన్సల్ లు ఓ కొత్త కంపెనీలో ఇప్పటికే రూ.6 కోట్ల పెట్టుబడి పెట్టారు. హైస్పీడ్ తో నడిచే ఎలక్ట్రిక్ టూవీలర్లను రూపొందించేందుకు రంగంలోకి దిగిన అథర్ కంపెనీలో బన్సల్ ద్వయం ఈ పెట్టుబడులు పెట్టారు. దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల ఉత్పత్తిలోకి దూకిన తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ లు 2013లో అథర్ ను ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్ సౌజన్యంతో మొదలైన ఈ కంపెనీ భవిష్యత్తులో గణనీయ వృద్ధి సాధిస్తుందన్న నమ్మకంతోనే బన్సల్ ద్వయం ఈ పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News