: వ్యక్తిగత విషయాలు చెబుతా... రేపు యూట్యూబ్ చూడండి: పవన్ కల్యాణ్ మాజీ సతీమణి
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూదేశాయ్ ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. డిసెంబర్ 4న (రేపు) తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్నానని... ఆ ఇంటర్వ్యూని యూట్యూబ్ లో చూడవచ్చని ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తానని చెప్పి మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు. పవన్, రేణులు విడిపోయాక, తమ బ్రేకప్ కు గల కారణాలు ఏమిటనే విషయం ఇటు పవన్ కాని, అటు రేణు కాని వెల్లడించలేదు. అదంతా వ్యక్తిగతమంటూ దాటవేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు వెల్లడిస్తానని రేణూదేశాయ్ చెప్పడంతో... ఏం చెబుతారా అన్న ఆసక్తి నెలకొంది.