: ఆఫ్రికాలో ఎత్తైన టవర్ నిర్మించనున్న బిన్ లాడెన్ కుటుంబం


కరడుగట్టిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబం ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన టవర్ నిర్మించనుంది. లాడెన్ కుటుంబ సభ్యులకు చెందిన నిర్మాణ సంస్థ 'సౌదీ అల్ తుర్కీ హోల్డింగ్ గ్రూప్' మొరాకో ఆర్థిక రాజధాని కాసాబ్లాంకాలోని ఆన్ఫా నగరం డౌన్ టౌన్ ప్రాంతంలో 514 మీటర్ల ఎత్తున్న 114 అంతస్థుల టవర్ నిర్మాణం చేపట్టనుంది. దీనికోసం ఏకంగా రూ. 6,100 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ టవర్ నిర్మాణం కోసం అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.

  • Loading...

More Telugu News