: బొల్లారంలో సేదతీరనున్న ప్రణబ్ ముఖర్జీ


ఈ నెల 24 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ శివార్లలోని బొల్లారంలో శీతాకాల విడిది చేయనున్నారు. ఆయన 31వ తేదీ వరకు ఇక్కడే ఉండనున్నారు. ఈ మేరకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రతా పరమైన అంశాలతో పాటు, అక్కడి సదుపాయాలు, రహదార్లు తదితరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు సమీక్షించారు. ఈనెల 20 లోపు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News