: స్మగ్లర్ అన్బు సెల్వం (అప్పు) అరెస్ట్
పోలీసులు ఎంతో కాలంగా అరెస్ట్ చేయాలని చూస్తున్న మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అన్బు సెల్వం అలియాస్ అప్పు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. చిత్తూరులోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యం పేరిట చికిత్స పొందుతున్నాడన్న సమాచారం తెలుసుకున్న శ్రీకాళహస్తి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అప్పూకు నెల్లూరులో ఖరీదైన భవనం ఉంది. సుమారు రూ.100 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కంచి శంకరమఠం మేనేజర్ రామన్ హత్యకేసులో అప్పూనే ప్రధాన నిందితుడు. ఎర్రచందనం అక్రమ రవాణాలోనూ కీలక నిందితుడు. అయితే, అక్రమ మద్యం కేసులో ప్రస్తుతం అప్పూను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.