: అశ్రునయనాల మధ్య ఫిలిప్ హ్యూస్‌ అంత్యక్రియలు... హాజరైన క్రికెట్ దిగ్గజాలు


ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిలిప్ హ్యూస్‌ అంత్యక్రియలు మాక్స్‌విల్లేలో మొదలయ్యాయి. ఆసీస్ ప్రధాని టోనీ అబాట్ ఈ కార్యక్రమంలో పాల్గొని హ్యూస్‌కు నివాళులు అర్పించారు. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్, క్రికెటర్ ఆరోన్ ఫించ్ తదితరులు హ్యూస్‌ పార్థివ దేహాన్ని ఉంచిన శవపేటికను తమ భుజాలపై మోసి ప్రియ మిత్రుడికి కడసారి వీడ్కోలు పలికారు. హ్యూస్ అంత్యక్రియలకు భారత్ తరఫున కోహ్లీ, రవిశాస్త్రి హాజరయ్యారు. వెస్టిండీస్ నుంచి బ్రియాన్ లారా వచ్చారు. వీరితోపాటు మార్క్‌టేలర్, రిచర్డ్ హాడ్లీ, షేన్ వార్న్, మైక్ హస్సీ, రికీ పాంటింగ్, బ్రెట్ లీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, గ్లెన్ మెక్‌గ్రాత్ తదితర క్రికెట్ దిగ్గజాలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News